ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు భాష చచ్చిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకోవడం ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అంటూ సీఎ జగన్ జనసేన అధినేతను ప్రశ్నించారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించాడు. నేను మూడు పెళ్ళిళ్లు చేసుకోవటం వల్ల జగన్ రెండేళ్లు జైలుకు వెళ్ళారా?..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే సూట్ కేసు కంపెనీలు పెట్టి విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లారా.. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు…అంటూ పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా ‘నిత్యకళ్యాణం’ గారూ… మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్యాకేజి స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు. అతిగా ఊహించుకోకండి అంటూ జనసేన అధినేతపై విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే సెటైర్ వేశారు..ప్రస్తుతం విజయసాయిరెడ్డి సెటైర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
