మధ్యప్రదేశ్ మంత్రి పాదాలను ఓ మహిళా అధికారి తాకిన వీడియో వైరల్ కావడంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ప్రజా పనుల మంత్రి సజ్జన్ సింగ్ వర్మ దెవాస్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మహిళా అధికారి ఆయన పాదాలకు నమస్కరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజేష్ లునావత్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నూతన మధ్యప్రదేశ్ ఇదే..అధికార యంత్రాంగం మంత్రి పాదాక్రాంతమైంద’ ని ఆయన ట్వీట్ చేయడం కలకలం రేపింది. గురునానక్ 550వ జయంతి వేడుకల సందర్భంగా దెవాస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన‍్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారలో ప్రార్ధనలు చేసేందుకు మంత్రి చేరుకోగా అక్కడే ఉన్న మహిళా అధికారి ఆయన పాదాలను తాకారు. మహిళా అధికారి దెవాస్ మున్సిపల్ కమీషనర్‌గా భావిస్తున్నారు.
#WATCH Madhya Pradesh: Dewas Municipal Corporation Commissioner, Sanjana Jain touched the feet of state Minister Sajjan Singh Verma while he was visiting a gurdwara in Dewas, on the occasion of Gurupurab, earlier today. pic.twitter.com/40ahf3Sfin
— ANI (@ANI) November 12, 2019