దేశంలో ఎక్కడో ఒకచోట. ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లా లో పదమూడేళ్ల తన కన్న కూతుర్ను రూ. 7లక్షలకు అమ్మేశాడు.
తన అన్న కూతురు కన్పించడం లేదని జూన్ నెల ఇరవై రెండో తారీఖున ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఆ పాప అచూకీ దొరికింది.
పాపను పట్టుకుని విచారించగా తన తండ్రి తనను ఎవరికో రూ. 7 లక్షలకు అమ్మాడాని చెప్పడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతైంది.