టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?.
అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటిస్తున్నాడని జక్కన్న ఇప్పటికే ప్రకటించేశాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్ సెట్స్ పైకి వచ్చాడు.
ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కోర్టు సెట్స్ లో అల్లూరి సీతారామారాజు బ్రిటీష్ వాళ్లను ప్రశ్నించే ఘట్టాలను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. అందుకే మెగాపవర్ స్టార్ పై సీన్స్ ను కోర్టు బోనులో చిత్రీకరిస్తున్నారు. ఇది అన్నమాట.