రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. రాలేదు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అప్పుడు కూడా నిరాశనే కలిగించింది. షూటింగ్ 60 శాతం కూడ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. జనవరి ఒకటిన ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది.ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదుగాని, ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషి అవుతున్నారు.
