ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే 175 నియోజకవర్గాలకు ఒక కోటి రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య ఉండకూడదని ప్రతి పేదవాడికి కనీస సౌకర్యాలైన ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో త్రాగు నీటిని కొనుక్కునే పరిస్థితి ఉన్నందున ఎవరు అవసరం లేదని ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్య తీర్చాలని జగన్ ఆదేశించారు.