జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను సరిగ్గా గౌరవించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభ అనంతరం పలు జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పవన్ గౌరవించుట ఆయనకు సరైన స్థానం కల్పించలేదు. తాజాగా కూడా ఇసుక సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు పవన్ తో పాటు మరో ముగ్గురు నలుగురు వెంట తీసుకెళ్లి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలిలో కూడా గెలిచిన రాపాక వరప్రసాద్ లేకపోవడం ఆయన అనుచరులకు మింగుడు పడడం లేదట. రాపాక చిన్న వ్యక్తి కూడా కాదు వయసులోనూ అనుభవంలోనూ పెద్ద వ్యక్తే అలాగే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి వెంటబెట్టుకుని ఉండి ఉంటే మంచిదని జనసేన పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు