ముంబైలో ఉండే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ నటి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయడం బాలీవుడ్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ముంబైలో ఉండే పాక్, ఆఫ్షన్ నటి మలీషా హీనాఖాన్ ట్విట్టర్లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఐ సపోర్ట్ రబీ ఫిర్జాదా అని కామెంట్ పెట్టింది. ఈ రబీ ఫిర్జాదా పాకిస్తాన్‌కు చెందిన సింగర్. గతంలో భారత ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తానని, పాములను వదిలేస్తానని బెదిరిస్తూ పోస్ట్‌లు పెట్టింది. పాములను పట్టుకుని ఫోటోలు రిలీజ్ చేసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో రబీ ఫిర్జాదాకు చెందిన నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెట్‌జన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కాగా ఆమె ప్రియుడే స్వయంగా ఆమె న్యూడ్ ఫోటోలను, వీడియోలను లీక్ చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ట్విట్టర్ కూడా రబీ ఫిర్జాదా న్యూడ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయద్దని నెట్‌జన్లకు విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో రబీ ఫిర్జాదా స్పందించింది. “నేను రబీ ఫిర్జాదా..ఈ గ్లామర్ ప్రపంచం నుంచి వైదొలుగుతున్నా, దేవుడు నా తప్పులను క్షమిస్తాడని ఆశిస్తున్నా..ప్రజలు నా విషయంలో దయ చూపించాలని కోరుతున్నా అంటూ రబీ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రబీకి నెట్‌జన్లు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రబీ ఫిర్జాదాకు మద్దతుగా పాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మలీషా హీనా ఖాన్ కూడా ట్విట్టర్లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మలీషా హీనా ఖాన్ పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.