Home / ANDHRAPRADESH / జగన్ ఒకటి రెండుసార్లు విమర్శిస్తేనే బెంబేలెత్తుతున్నావ్.. అదేపనిగా విమర్శించి ఉంటే ఈపాటికి ఏమైపోయేవాడో పవన్.?

జగన్ ఒకటి రెండుసార్లు విమర్శిస్తేనే బెంబేలెత్తుతున్నావ్.. అదేపనిగా విమర్శించి ఉంటే ఈపాటికి ఏమైపోయేవాడో పవన్.?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించడం మాని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ఎక్కువసార్లు విమర్శించారు. కాని ఏనాడు జగన్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా  విమర్శల చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ ను జగన్ పట్టించుకోలేదనే చెప్పాలి. పవన్ పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కూడా చంద్రబాబునాయుడు గారు ఆయన పార్టనర్ అంటూ జగన్ పిలిచేవారు. అయితే గత పాదయాత్రలో మాత్రం ఒకే ఒక్కసారి భార్యలను కార్లు మార్చినట్టు మారుస్తున్నాడు అంటూ జగన్ విమర్శించారు. మళ్లీ పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదు.

 

 

 

 

 

 

 

అయితే తాజాగా ఇంగ్లీష్ మీడియం బోధన అవసరంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తుండడం పట్ల జగన్ సీరియస్ అయ్యారు. మీ భార్యలకు వారికి ఉన్న పిల్లలను ఏ మీడియంలో చదివి ఇస్తున్నారంటూ ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రత్యేకించి విజయవాడ వచ్చి మరీ మీడియా సమావేశం పెట్టారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇన్నేళ్ల రాజకీయంలో కేవలం రెండుసార్లు మాత్రమే జగన్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఈ మాత్రానికే పవన్ ఏకంగా ప్రత్యేకించి ప్రెస్ మీట్ లు పెడుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి జగన్ మాట్లాడి ఉంటే అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటీ అని జనసేన కార్యకర్తలే ఆలోచించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat