ఏపీలో త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు రాశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమను కలిశారని అన్న సోము వీర్రాజు త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబు తప్ప..మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటామని..ఈ శాసనసభలో తమకు ప్రాతినిధ్యం ఉండడం ఖాయమన్నారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అవడం ఖాయమని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంగ్లీష్ మీడియం పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సోమువీర్రాజు..ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకోవాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఆయన అదే సమయంలో తెలుగు భాషకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. మొత్తంగా గంటాతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరుతారని, త్వరలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది.
