జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే..రెండేళ్లు జైల్లో ఉన్నారా అంటూ పవన్ జగన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం జగన్ చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదంటూ పేర్ని నాని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ మండిపడ్డారు..తమ సర్కారు లక్ష ఉద్యోగాలిచ్చిన విషయం పవన్ కు కనిపించలేదా? అని మంత్రి ప్రశ్నించారు. విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మరోసారి పేర్ని నాని స్పందించారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడిన అచ్చెన్నాయుడిని, డ్రగ్స్, గంజాయి మాఫియాతో చెలరేగిపోయిన అయ్యనపాత్రుడిని పక్కనే కూర్చోబెట్టుకుని…ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అంటూ ఎలా మాట్లాడావు పవన్ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందిస్తూ..పవన్ నాయుడూ.. నువ్వు ఒక సారి తాట తీస్తాం అంటే మేం వందల సార్లు తాట తీస్తాం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేవలం చంద్రబాబు చెప్పింది మాత్రమే వినిపిస్తుంది..పవన్ భాషా వేషం చంద్రబాబు కోసమే అని నాని విరుచుకుపడ్డారు. సినిమాల్లో గబ్బర్ సింగ్ అని పేరు తెచ్చుకున్న పవన్..రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు ఎటు సాగదీస్తే అటు సాగే..రబ్బర్ సింగ్‌గా మారిపోయారని సెటైర్ వేశారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ జైలుకు వెళ్లారా అని పవన్ వేసిన సెటైర్‌పై మంత్రి నాని మండిపడ్డారు. నీ పార్టనర్ చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న తర్వాతే జగన్ జైలుకు వెళ్లారన్న విషయం జనానికి తెలుసని, అయినా ఆ కేసులు ఎలా నమోదయ్యాయో నీ పక్కనే కూర్చున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ నీకు ఎప్పుడూ చెప్పలేదా పవన్ నాయుడు అని నాని ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకో.. ఎవరు వద్దన్నారు అని జగన్‌పై పవన్ చేసిన కామెంట్‌పై మాట్లాడుతూ…పెళ్లిళ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే… ప్రజా సేవపై మక్కువ ఉన్న జగన్ ఏపీకి సీఎం అయ్యారని నాని జనసేనానికి కౌంటర్ ఇచ్చారు. పవన్ కు నరనరాల కుల భావన జీర్ణించుకుపోయిందని, కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని పేర్ని మరో ఘాటు వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ కుమారుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుతున్నాడని.. అందులో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని.. దాని గురించి గొప్పగా చెప్పే పవన్ రాష్ట్రంలో తెలుగుకు ఏదో అయిపోతుందన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తంగా సీఎం జగన్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని స్పందిస్తూ..సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
