బిగ్ బాస్ 3లో సందడి చేసిన పునర్నవి – రాహుల్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ పుణ్యామా అని వీరిద్దరు తెగ ఫేమస్ అయిపోయారు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. అందులో అలీ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పిందీ జంట. హౌస్ ఎక్కువగా ఎవరిష్టమని అలీ అడగడంతో.. ఇంకెవరు పునర్నవి అని.. ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేశాడు రాహుల్. సాయం చేసిన వాళ్లంతా ఎప్పటికీ గుండెల్లో ఉంటారని అన్నాడు. ఐతే అందరూ అక్కడ పట్టరని సెటైర్లు వేసింది.
#AlithoSaradaga promo ?#PunarnaviBhupalam #RahulSipligunj with #Ali ❤️
Full Episode Watch it on @etvteluguindia 18th November 2019 @ 9.30 PM
— Punarnavi Bhupalam (@PunarnaviB) November 13, 2019