తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగరంలోని నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూంలో సిపి అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు 25శాతం తగ్గాయన్నారు. వాహనదారులు 100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలి. ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ లు తగిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.