చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం సంఘమిత్రల సమావేశాన్ని నిర్వహించారు. ఎపీఎం.నరసింహులు, ఎంపీడీఓ అమర్నాథ్, ఏరియా కోఆర్డినేటర్ మాధవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు మీన ల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ నంగా పద్మజా రెడ్డి విచ్చేసి ఎన్నికల్లో జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం సంఘమిత్రల కోరికను నెరవేర్చడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అమర్నాథ్, ఏరియా కోఆర్డినేటర్ మాధవిలు మాట్లాడుతూ.. సంఘమిత్రలు ఎన్నో సంవత్సరాల నుండి తక్కువ గౌరవ వేతనంతో పని చేస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారని, వీరి శ్రమను గుర్తించి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం వారికి వేతనం పదివేల రూపాయలను పెంచడం చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. సంఘమిత్రలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
