Home / ANDHRAPRADESH / టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు ఏపీలో కూడా టీడీపీ కేవలం 23 సీట్లతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలైతే..కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమాధి అయింది. కేంద్రంలో మోదీ మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుని పోయింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ప్రభుత్వాల ఏర్పాటుకు జరుగుతున్న చర్చలు ఫలించడం లేదు. దీంతో మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ మహారాష్ట్ర ఉదంతంపై చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా అదిరిపోయే సెటైర్ వేశారు. తెలంగాణా,ఆంధ్రా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చెల్లని కాసు అయిపోయాడు. లేదంటే ముంబాయిలో తిష్ట వేసి నాలుగు భిన్నపక్షాలను ఏకం చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా అని చిటికెలేసేవాడు. పాపం సారు పాదం మోపితే శని దేవత జిడ్డులా పట్టుకుంటుందని తెలిసిపోవడంతో.. ఫోన్లు కూడా ఎత్తడం లేదంట ఎవరూ…అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇక ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయాడు నారాచంద్రబాబు నాయుడు గారు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకానితనాన్ని బయట పెట్టుకున్నాడంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat