విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంక సీనియర్ నటుడు వెంకీ విషయానికి వస్తే అతడు చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు. వెంకీ చేస్తున్నమల్టీ స్టారేర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని భావిస్తుంది. అలా చేసి వెంకీ కి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకు గిఫ్ట్ ఎందుకు అనే విషయానికి వస్తే డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు కాబట్టేఇది వెంకీ కి మంచి గిఫ్ట్ అనే చెప్పాలి.
