బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి అవసరమైన మార్పులు చేర్పులు చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
నిబంధనల ప్రకారం ఉన్న ఏ వ్యక్తీ అయిన సరే రాష్ట్ర క్రికెట్ సంఘంలో కానీ బీసీసీఐ లో కానీ ఆఫీస్ బేరర్లుగా ఉంటే ఆపై మూడేళ్ళ తర్వాతేనే మళ్లీ పోటీ చేయాలని నిబంధనను మార్చాలని బోర్డు భావిస్తుందని సమాచారం.