పూజా హెగ్డే చూడగానే మత్తెక్కించే అందం.. ఒక్కసారి చూస్తే రాత్రి కుర్రకారుకు కలలోకి వచ్చే సోగస్సుల రాణి. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ హీరోయిన్ పూజా. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ అమ్మడు అదే మెగా కాంపౌండ్ హీరో అయిన స్టైల్ స్టార్ అల్లు అర్జున సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ మూవీ గురించి ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ఈ చిత్రంలో నా పాత్రను దర్శకుడు త్రివిక్రమ్ అత్యుత్తమంగా తీర్చి దిద్దాడు.
కెరీర్లోనే ఈ మూవీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమాలో హీరో అర్జున్ కు నేను బాస్ లా కన్పిస్తాను. ఆఫీసు వ్యవహారాల్లో కాస్త కఠినంగా ఉన్నా కానీ ఎవరైన పొగిడితే మాత్రం కూలవుతాను. ఈ సినిమా అసాంతం నేను హీరోకి బాస్ గా కన్పిస్తాను”అని చెప్పుకుంటూ వచ్చింది ముద్దుగుమ్మ.