జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ,నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు,వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న ఇంగ్లీష్ మీడియం లాంటి మొదలైన అంశాల గురించి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో… నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు వివరించారు..
