అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అండదండలతో రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని తెలుగుదేశం జాతీయ నాయకుడు నారా లోకేష్ విమర్శించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోమ వారం కర్నూలు జిల్లా పత్తికొండకు వచ్చారు. ఈ సంధర్భంగా మాట్లడూతు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక కత్రిమ కొరత సృష్టించి భవన కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవన్నారు.అంతకుముందు టిడిపి పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కెఇ.శ్యాంబాబు మాట్లాడారు. వైసీపీ నాయకులు పత్తికొండలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీంతో పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అటు నారా లోకేష్ ఇటు కెయి ఫ్యామీలీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
ఆనాడు ఇసుక మాఫియాపై కోర్టులో పిటిషన్ వేసినందుకు తన భర్తను హత్య చేసిన మాట వాస్తవం కాదా అని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అలాగే నా భర్త నారాయణరెడ్డి ఉంటే ఇసుక దందా, కెఇ కుటుంబం ఆగడాలు సాగవని హత్య చేశారు.గత ప్రభుత్వంలోజిల్లాలో జరిగిన ఇసుక అక్రమాలపై ఏమి తెలియకుండా లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.ఇంకా చెప్పాలంటే ఇసుక ఆదాయం కోసం మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడికి ఏం సమాధానం చెపుతారు లోకేష్ అన్నారు. మరి విచిత్రంగా ఉంది లోకేష్ ఇసుక దోచుకోవడం కోసం..బెదిరింపులు, హత్యలు చేసిన మీరే ఇలా మాట్లడడం. ఇలాంటి మాటలు చూసి ప్రజల్లో చైతన్యం వచ్చి నేడు అత్యంత భారి మెజార్టీతో వైసీపీ పార్టీని , నన్ను ఎమ్యెల్యేగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ప్రజలు నీవు కాదు మీ నాయనా వచ్చి చెప్పిన నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్ అన్న ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు ఏంతో మేలుజరుగుతుంది. అది ఓర్వలేక మీరు ఇప్పుడు ఇసుక మాఫియా అంటూ మరోసారి ప్రజల్లో నమ్మకం కోల్పోయారని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.