సోమవారం కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్ళు ఢీ కోట్టుకున్న విషయం తెలిసిందే. స్టేషన్ పరిదిలో కర్నూల్ ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్ళు ఎదురెదుగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో సుమారు 40మందికి పైగా గాయాలు అయ్యాయి. దీనంతటికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..!
*అప్పుడు సమయం 10 గంటల 20నిముషాలు. ఆ సమయంలోనే లింగంపల్లి నుండి ఫలక్ నుమా వెళ్ళే ఎంఎంటీఎస్ రెండో నెంబర్ ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చింది. అదే సమయంలో కర్నూల్ నుండి సికింద్రాబాద్ వెళ్ళాల్సిన హింద్రీ ఇంటర్సిటీ అక్కడికి వచ్చి ఆగింది.
*అయితే ఇంటర్సిటీ మూడో ఫ్లాట్ ఫామ్ కి వెళ్ళాలి. అయితే ట్రైన్ మెయిన్ లైన్ పై ఉండడంతో ఒకటినుండి రెండు తర్వాత మూడికి వెళ్ళాలి.
*ఇక గ్రీన్ సిగ్నల్ పడింది. దాంతో కదిలిన ఇంటర్సిటీ మొదటి ట్రాక్ నుండి రెండో ట్రాక్ కు వస్తుంది. ఈలోగా రెండో ట్రాక్ పై ఉన్న ఎంఎంటీఎస్ అప్పటికే స్టార్ట్ అవ్వడంతో నేరుగా వెళ్లి ఢీ కొట్టింది. ఇలా కొన్ని సాంకేతిక లోపల వాళ్ళ ఈ ఘటన జరిగింది.