ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడ వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ కి హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తన మద్దతు ముఖ్యమంత్రి జగన్‌కే అంటూ రాజశేఖర్ ట్వీట్లు చేశారు.
‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు తీసుకున్న నిర్ణయం సరైంది. నేటి ప్రపంచంలో ఉద్యోగాలు పొందడానికి, ఇతరులతో మాట్లాడటానికి ఇంగ్లీష్ చాలా ముఖ్యమైంది. చాలామంది ఇంగ్లీష్ రాకపోవడంతో ఉన్నత చదవుల తర్వాత ఉద్యోగాలు పొందే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు’అన్నారు. ‘ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల.. ఇలాంటి సమస్యలకు ముగింపు పలకొచ్చు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు తెలుపుతున్నా. అంతేకాదు మన మాతృభాష తెలుగును కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరికీ విద్య సమానంగా అందాలని కూడా సూచించారు రాజేశేఖర్.
Chief minister, Ys Jagan Garu's decision to introduce english medium in goverment schools is absolutely right! In today's world it is key to speak english to get jobs and communicate. There are so many people struggling in their higher studies and to get jobs because of their…
— Dr.Rajasekhar (@ActorRajasekhar) November 12, 2019
…inability to speak the language. This will put an end to that. I completely support this. Along with this I strongly feel that our mother tongue Telugu should also be made a compulsary subject! Education must be equal to all, this is taking us one step closer!
— Dr.Rajasekhar (@ActorRajasekhar) November 12, 2019