ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి కౌంటర్ ఇచ్చాడు.”ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయాడు చంద్రబాబు గారు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడు” అని అన్నాడు.