గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. “తెలంగాణా,ఆంధ్రా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చెల్లని కాసు అయిపోయాడు. లేదంటే ముంబాయిలో తిష్ట వేసి నాలుగు భిన్నపక్షాలను ఏకం చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా అని చిటికెలేసేవాడు.సారు పాదం మోపితే శని దేవత జిడ్డులా పట్టుకుంటుందని తెలిసిపోవడంతో ఫోన్లు కూడా ఎత్తడం లేదంట ఎవరూ” అని చెప్పారు.