సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి జలాలు విడుదల మంత్రి జగదీష్ రెడ్డి అభీష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు .నీటికి కొరత లేదని అన్ని చెరువులు నింపాలన్నదే ప్రభుత్వ అభిమతమని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
మరమ్మతులు గురైన కాలువలను గుర్తించాలని ఆయన మంత్రికి సూచించారు. అందుకు అనుగుణంగా వచ్చే వేసవి నాటికి మరమ్మతులు చేయనున్న కాలువ కట్టల నిర్మాణానికి అంచనాలు రూపొందించుకోవలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి ని ఆదేశించారు.