తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం..
ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ చేసింది.
67.03 పాయింట్లతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. 55.97పాయింట్లతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. చెన్నై,ముంబై,ఢిల్లీ,కలకత్తా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.