ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ ట్రోపీలో విదర్భాతో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్స్ లో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ కూడా ఉంది.
