నిన్న బంగ్లాదేశ్, ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం మాత్రం భరత్ నే వరించింది. కాని ఒక పరంగా చూసుకుంటే బంగ్లా ప్లేయర్స్ భారత్ ను వణికించిందనే చెప్పాలి. అయితే నిన్న అందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి. కాని నిన్న భారత్ మరో రికార్డ్ ఆట కనబరిచింది. అది ఉమెన్స్ మ్యాచ్ లో. వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదంతా పక్కనపెడితే ఇందులో అద్భుతం ఏమిటంటే షెఫాలి వర్మ తన అద్భుతమైన ఆటతో అందరిని ఆకట్టుకుంది. ఫలితం లిటిల్ మాస్టర్ రికార్డును బ్రేక్ చేసింది. అదేమిటంటే 15 ఏళ్ల 285రోజుల వయసులోనే అర్ధ శతకం సాధించి. ఈ గానతను సచిన్ 16ఏళ్ల వయసులో సాధించాడు.
