సోషల్ మీడియా అంటే పొలిటికల్ వార్ గానో.. లేదా మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రచారం జరిగే మీడియాగా కొంతమంది చూస్తారు. కానీ అదే సోషల్ మీడియా దివ్య అనే ఒక పేద బాలిక ఆకలిని తీర్చింది. అసలు విషయం ఏమిటంటే పైన ఫోటోలోని దివ్య సంఘటన చాలా మంది హృదయాలని కలిచివేసింది.
అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు 5జీ,6జీ అంటూ సాంకేతికరంగంలో కొత్త పుంతల వైపు పరుగులు పెడుతుంటే ఇంకా మన దేశంలో పేదలు ఇంకా అన్నం కోసం పోరాడుతునే ఉన్నారని పోస్టులు పెట్టారు నెటిజన్లు.
ఆ ఫోటోను చూసిన సామాజిక సేవకుడు వెంకటరెడ్డి ఆ పాప తల్లి దండ్రులతో మాట్లాడాడు. అంతేకాకుండా ఆ పాప కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను అదే బడిలో చేర్చాడు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ” పిల్లలు తిన్నాక మిగిలిన ఆహారం చూసి వెంటనే స్పందించి సాయం చేశానని ఆయన తెలిపారు.