ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి వస్తోన్న భారీ నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ఇప్పటికే నిండుకుండలా తయారైన సాగర్ వరద నీటితో కళకళలాడుతోంది. వరద ఎక్కువ రావడంతో ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి మరి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 62,144 క్యూసెక్కులు ..మరోవైపు ఔట్‌ఫ్లో 62,144క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండినందుకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా ఉంది. అయితే నాగార్జున సాగర్ పూర్తిస్తాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా మొత్తం ప్రస్తుత నీటిమట్టం కూడా అంతే మొత్తంలో ఉంది.
