తెలంగాణ రాష్ట్రంలోని టీవీ రంగ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. టీవీ రంగంలోని తెలుగుకు సంబంధించిన కార్మికులకు బీమా వసతిని కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో చర్చిస్తాము. అందుకు తగిన ఏర్పాట్లను చేయిస్తామని తనను కలవడానికి వచ్చిన తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసానిచ్చారు.
అయితే బీమా సమస్యనే కాకుండా పలు అంశాల్లో శాశ్వత పరిష్కారం చూపించాలని టీవీ ఆర్టీస్టుల సంఘం ప్రతినిధులు మంత్రి తలసానిని కోరారు.