దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సున్నితమైన రాజజన్మభూమి – బాబ్రీమసీదు వివాదంపై తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని…దేశ ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎంలు, మతపెద్దల వరకూ అందరూ పిలుపునిచ్చారు. జాతీయ మీడియా కూడా సున్నితమైన ఈ అంశంపై చాలా జాగరూకతతో ప్రసారాలు అందించాయి. ఎక్కడా ఏ వర్గాన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్త వహించాయి. తెలుగు మీడియా ఛానళ్ల కూడా చాలా వరకు సంయమనం పాటించాయి. తీర్పు ఎలా ఉన్నా సుప్రీంకోర్ట్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అనే కోణంలో ప్రధాన ఛానల్స్ అన్నీ విజ్ఞప్తి చేశాయి. అయితే బాబుగారికి కొమ్ము కాస్తూ సీబీఎన్ ఛానల్ అని పిలిపించుకునే ఓ ఛానల్ మాత్రం సున్నితమైన ఈ అంశాన్ని కూడా తన రాజకీయాల కోసం ఉపయోగించుకుంది. తన రేటింగ్ పెంచుకునేందుకు దిగజారిపోయి..ఏకంగా పోల్ పెట్టేసింది. ఉదయం సుప్రీంకోర్ట్ ధర్మాసనం తుదితీర్పు ప్రకటించడం ఆలస్యం..అయోధ్యపై సుప్రీం తీర్పును మీరు సమ్మతిస్తారా అంటూ ఓ పోల్ పెట్టేసింది. దీంతో నెట్‌జన్లు సదరు టీవీ ఛానల్‌పై మండిపడ్డారు. పరమత సహనాన్ని పాటించే ఈ దేశంలో ఇలాంటి రెచ్చగొట్టే సర్వేలు పెట్టడానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా..దాదాపు గంట సేపు ఈ పోల్‌ను సదరు టీవీ ఛానల్ కొనసాగించింది. దాదాపు 500 మందికి పైగా పాల్గొన్నారు కూడా. కాగా ఈ పోల్ సోషల్ మీడియాపై నిఘా పెట్టిన పోలీసుల దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమైన సదరు ఛానల్ వెంటనే పోల్‌ను డిలీట్ చేసింది. మతవిద్వేషాలు చెలరేగేలా పచ్చ మీడియా ఛానల్ నిర్వహించిన ఈ ఆన్లైన్ పోల్‌పై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబుకు కమ్మగా కొమ్ము కాస్తూ…మీడియా మోతుబరిని అని బిల్డప్ ఇచ్చుకునే సదరు పచ్చమీడియాధిపతిని వెంటనే అరెస్ట్ చేయాలని నెట్‌జన్లు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే సదరు ఛానల్ సోషల్ మీడియా అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని నెట్‌జన్లు కోరుతున్నారు. అయోధ్య వంటి సున్నితమైన మత విశ్వాసాలకు సంబంధించి..ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి..ముఖ్యంగా మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలి..కానీ ఎల్లో మీడియా ఛానల్ మాత్రం ఆన్లైన్ పోల్ ద్వారా సుప్రీం తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేసింది. దేశభద్రతకు, మత సామరస్యానికి భంగం కలిగించే సదరు పచ్చ మీడియా ఛానల్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా తనకు చంద్రబాబుకు కలిసివచ్చే రాజకీయ ప్రయోజనాలే తప్పా.. దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని సీబీఎన్ ఛానల్ మరోసారి నిరూపించుకుంది..థూ..ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా..తెలుగు నేలపై ఇలాంటి ఛానల్ ఉండడం తెలుగు వాళ్లు చేసుకున్న ఖర్మ..అంతే..!
