2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది..కేవలం రెండంటే రెండే సీట్లను గెల్చుకుంది..అయితే అన్ని నియోజకవర్గాల కంటే..అందరిని తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియోజకవర్గం..మైలవరం. ఇక్కడ మంత్రిగా అధికారం చెలాయించిన దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సంచలన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆదేశాల మేరకు పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ కృష్ణప్రసాద్‌పై తప్పుడు కేసులు బనాయించడంతో మైలవరంలో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. ఈ పరిస్థితులలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. దీంతో మైలవరంలో గెలుపు ఎవరిది అన్న ఆసక్తి రాష్ట్రమంతటా నెలకొంది. కాగా ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమను ఓడించి సంచలనం సృష్టించారు. అయితే ఓటమిని జీర్ణించుకోలేని దేవినేని ఉమ పదే పదే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో వసంత కృష్ణప్రసాద్ ఇసుక దోపిడికి పాల్పడుతున్నట్లుగా ఉమ అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. దేవినేని ఉమ ఆరోపణలపై వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. తాను తప్పు చేస్తున్నట్లుగా చెప్పటమే కాని ఎలాంటి ఆధారాలు చూపించలేని దేవినేనిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బురదలో పంది..ఉమ ఒక్కటే అన్న..వసంత…గత ఐదేళ్లు జిల్లాలో ఇసుక దోపిడీకి ఎవరూ పాల్పడ్డారో ప్రజలందరికి తెలుసునని ఫైర్ అయ్యారు. బురదలో పంది..దేవినేని ఉమ ఒక్కటే అని ఈ సందర్భంగా వసంత తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే..తానే దేనినేని ఉమ ఇంటికి వెళ్లి చొక్కా పట్టుకుని అడుగుతానని..ఆయనో వెధవ అంటూ వసంత విరుచుకుపడ్డారు. మొత్తంగా దేవినేని ఉమపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారాయి.