అగ్రిగోల్డ్ బాధితులకు చెక్‌లు పంపిణీ చేసిన సందర్భంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో లోకేష్ స్పీకర్ తమ్మినేనికి ఓ బహిరంగ లేఖ రాశాడు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ సవాలు విసిరాడు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని లోకేష్ ప్రశ్నించాడు. నారా లోకేష్ లేఖకువైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లోకేష్ మాట్లాడుతున్నాడని..మండిపడ్డారు. ఇక స్పీకర్‌కి బహిరంగ లేఖ రాయడం మరింత హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత గత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. నాడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా నీ బాబు కొన్నా… చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ఏపీ స్పీకర్ దివంగత నేల కోడెల ఉండేవారని మంత్రి విమర్శించారు. మీకులాగా నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడకుండా..విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప వ్యక్తి మా నాయకుడు జగన్ అని మంత్రి అన్నారు.. అసలు లోకేష్ కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్సీకి తక్కువ అని సెటైర్ వేశారు. అయినా టీడీపీని కనుమరుగు చేయాలంటే జగన్‌కి ఒక్క నిమిషం చాలు..ఆయన తలుచుకుంటే నీతో సహా అందరూ వైసీపీలోకి వస్తారని మంత్రి కౌంటర్ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అవును ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని లోకేష్..నిజంగానే కార్పొరేటర్‌కు ఎక్కువ..ఎమ్మెల్సీకి తక్కువ అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా లోకేష్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
