రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన స్పిన్నర్ అని చెప్పాలి. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. భారత్ జట్టుకు మూడు ఫార్మాట్ లోను తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అశ్విన్ అడుగుపెడితే వికెట్ల పతనమే అనుకునేవారంతా. అలాంటి వ్యక్తికి కొంతకాలంగా గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే చాహల్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన స్పిన్నర్ అని చెప్పాలి. అయితే ఈ ఆటగాడు మరో నాలుగు వికెట్లు తీస్తే అశ్విన్ రికార్డు బ్రేక్ చేసినవాడు అవుతాడు. తద్వారా టీ20 లో భారత తరుపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలుస్తాడు.