దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అంటారు. ప్రస్తుతం గాంధీ కుటుంబ సభ్యులో ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ ప్లస్ క్యాటగిరి రక్షణను కల్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబానికి ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను కల్పిస్తూ వస్తుంది.
అసలు ఎస్పీజీ సెక్యూరిటీ అంటే ఏమిటి..?
1985లో ఎస్పీజీ ఏర్పాటు – ధైర్యం, భక్తి, రక్షణ స్ఫూర్తితో కూడి.. ఎటువంటి లోపం లేకుండా శ్రేష్ఠమైన భద్రతను కల్పించడమే ఎస్పీజీ..
– వీరి ధైర్యసహసాలకుగాను శౌర్య చక్ర, రాష్ట్రపతి పోలీస్ మెడల్ వంటి ఉన్నతమైన అవార్డులను అందుకుంటారు.
– దేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు ఆ తర్వాత సంవత్సరమే ఇందిరాగాంధీ హత్య. అంగరక్షకులే కాల్చి చంపారు. అనంతర కాలంలో వీఐపీలకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నారు.
వారి ఇండ్లు, కార్యాలయాలు, పర్యటనలు – రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎస్పీజీ చట్టంలో మార్పులు తీసుకువచ్చారు.
మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు 10 ఏండ్ల వరకు ఈ భద్రత కల్పిస్తారు.