దిశా పటానీకి ఏమైంది..?. అలా కూర్చుంది..?. అది నేలపై కూర్చుంది..? అని అన్పిస్తుంది కదా .. ఈ ఫోటో చూస్తుంటే. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది.
ప్రస్తుతం మోహిత్ సూరీ దర్శకత్వంలో మలంగ్ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్,అనీల్ కపూర్,కునాల్ కెమ్ము ప్రధాన పాత్రదారుల్లో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రభుదేవా- సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాధే చిత్రంలో నటిస్తుంది దిశా.
అయితే రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు దిశా పటానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే క్రమంలో తన మోకాళ్ళని గాయపర్చుకుంది. తన ఇన్స్టాగ్రామ్లో గాయపడిన మోకాళ్ళని చూపిస్తూ.. ప్రభుదేవ పాట షూటింగ్ అంటే ఇలానే ఉంటుంది అని కామెంట్ పెట్టింది.