మీరు చదివింది అక్షరాల నిజం. తన నటనతో.. సూపర్ స్టైల్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి హాలీవుడ్ రేంజ్ వరకు అభిమానులను సంపాదించున్న సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్. అలాంటి రజనీకాంత్ తనను నమ్మమని ప్రెస్మీట్ పెట్టి మరి అడుగుతున్నాడు.
ఇంతకు మ్యాటరేంటీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానీ మద్ధతు ఇస్తున్నాడు. ఆ పార్టీకి సూపర్ స్టార్ నాయకుడంటూ ఇటు సోషల్ మీడియా. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరలవుతున్న వార్తలు.
అయితే తనపై వస్తోన్న వార్తల గురించి సూపర్ స్టార్ రజనీ కాంత్ క్లారిటీచ్చాడు. అందుకే రజనీ కాంత్ మాట్లాడుతూ నేను ఏ పార్టీకి అభిమానిని కాదు. మద్దతు ఇవ్వడం లేదు. ఏ పార్టీలోనూ నేను నాయకుడ్ను కాదు. నన్ను నమ్మండని సూపర్ స్టార్ వేడుకుంటున్నాడు.