ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా అటు హీరోగా ఇటు నిర్మాతలుగా కూడా పాలుపంచుకుంటున్నారు. మహష్, రామ్ చరణ్ నాని, విజయ దేవరకొండ ఇలా ఎవరికివారు బిజీగా ఉన్నారు. అయితే ఇంకా మహేష్ విషయానికి వస్తే సొంతంగా బ్యానర్ పెట్టుకొని తన సినిమాలకే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం అదే రూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని సమాచారం. తన సొంత నిర్మాణంలో తాను కూడా సినిమాలు తియ్యాలని భావిస్తున్నాడట. ఇది ప్రస్తుతానికి వార్తలు మాత్రమే మరి ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం ఉందో తెలియాలంటే దానికి ఎన్టీఆర్ సమాధానం చెప్పాల్సిందే.