దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు శనివారం సంచలన తీర్పునిచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా అయోధ్యలోని వివాదస్పద భూమిని పంచే వీల్లేదని తేల్చి చెప్పింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది.
మరోవైపు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచించింది.