సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”.
ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 29న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మహేష్ బాబు చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇతర పాత్రల్లో తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ లు నటిస్తున్నారు. గుండెలను హత్తుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ పై మీరు ఒక లుక్ వేయండి.