డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షోలు ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయని చెప్పాలి. ఎందుకంటే వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. డీ కి కూడా ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి వచ్చాడు. మరోపక్క అభిమానులు ప్రదీప్ కు ఏమైందనే ఆందోళనలో ఉన్నారు. దీనికి క్లారిటీ ఇచ్చిన రవి తనకి ఆరోగ్యం కొద్దిగా బాగోకపోవడంతో దూరంగా ఉన్నాడని, కొద్ది రోజుల్లో వచ్చేస్తాడని చెప్పాడు. అలా చెప్పి చాలా రోజులు అయినప్పటికీ ఇంకా ఎలాంటి విషయం బయటకు రాకపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చివరికి ప్రదీప్ నే బయటకు వచ్చాడు. సోషల్ మీడియా వేదికగా నా మీద ఇంత అభిమానం చూపిస్తున్న అందరికి ధన్యాదాలు. నా విషయానికి వస్తే నాకు కాలికి దెబ్బ తగలడంతో రెస్ట్ తీసుకుంటున్నాను. త్వరలోనే వస్తానని క్లారిటీ ఇచ్చాడు.
