దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది.
మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.
అయితే అయోధ్య తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ”అయోధ్య తీర్పుపై ఎవరు కూడా రెచ్చగొట్టే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు.. అన్ని వర్గాలు శాంతి భద్రతలకు సహాకరించాలి. అయోధ్య తీర్పును అందరూ గౌరవించాలని”ఆయన పిలుపునిచ్చారు.