Home / BHAKTHI / 15వ దశాబ్దం నుండి సాగుతున్న అయోధ్య భూవివాదం సాగిందిలా..!

15వ దశాబ్దం నుండి సాగుతున్న అయోధ్య భూవివాదం సాగిందిలా..!

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళే తుది తీర్పు వెలువరించనుంది. సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే అయోధ్య వ్యాజ్యాలపై 40 రోజుల నిర్విరామ విచారణను పూర్తి చేసింది. తీర్పును మాత్రం వాయిదా వేసింది. నవంబర్​ 17న ప్రస్తుత సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయి పదవీ విరమణ చేస్తున్నందున.. దశాబ్దాల ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య భూవివాద కేసు కొనసాగిన తీరును పరిశీలిస్తే…

15వ దశాబ్దం నుంచి నేటికీ చర్చనీయాంశంగా ఉన్న అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య భూవివాదం’. 2.77 ఎకరాల భూమిపై తమదంటే తమదే హక్కు అని హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. మొఘల్​ చక్రవర్తి బాబర్​ కాలం నుంచి నానుతున్న ఈ వివాదం పూర్వాపరాలేమిటో ఓ సారి చూద్దాం.

అయోధ్య భూవివాదం సాగిందిలా…

1528 : మొఘల్​ చక్రవర్తి బాబర్​ సేనాని​ మీర్​ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు.

1885 : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తొలిసారి కోర్టు మెట్లెక్కింది. మసీదు వెలుపల మండపాన్ని నిర్మంచేందుకు అనుమతివ్వాలని మహంత్‌ రఘువీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం కొట్టివేసింది.

1949 : వివాదాస్పద మసీదు లోపల రాముడి విగ్రహాలు వెలిశాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి.

1950 : రాముడికి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని గోపాల్​ సిమ్లా విశారథ్, పరమహంసా రామచంద్రదాస్​.. ఫైజాబాద్​ జిల్లా కోర్టులో దావా వేశారు.

1959 : అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాడా సంస్థ.

1981 : అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్​ బోర్డు తరఫున కోర్టులో వ్యాజ్యం దాఖలు.

1986 ఫిబ్రవరి 1 : మసీదులో హిందూ వర్గం వారు పూజలు చేసుకునేందుకు అనుతించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన స్థానిక కోర్టు.

1992 డిసెంబర్​ 6 : బాబ్రీ మసీదు కూల్చివేత.

2002 ఏప్రిల్​ : వివాదాస్పద భూమిపై ఎవరికి హక్కుందో తేల్చేందుకు అలహాబాద్​ హైకోర్టులో విచారణ మొదలు.

2010 సెప్టెంబర్​ 30 : వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాలు మూడు సమాన భాగాలుగా పంచుకోవాలని అలహాబాద్​ హైకోర్టు తీర్పు.

2011 మే 21 : అలహాబాద్​ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.

2017 ఆగస్టు 7 : అలహాబాద్​ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.

2018 జులై 20 : అయోధ్య తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.

2018 డిసెంబర్​ 24 : 2019 జనవరి 4న మరోమారు అయోధ్య వ్యాజ్యాలపై విచారణ చేపడతామన్న సుప్రీం.

2019 జనవరి 8 : అయోధ్య వ్యాజ్యాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. సీజేఐతో పాటు సభ్యులుగా జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ డీవై చంద్రచూడ్​.

2019 జనవరి 25 : కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్​ లలిత్. జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ నజీర్​తో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.

2019 జనవరి 29 : వివాదాస్పద భూమి చుట్టూ ఉన్న 67 ఎకరాల స్వాధీన భూమిని వాటి యజమానులకు ఇవ్వాల్సిందిగా సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం.

2019 మార్చి 8 : వివాద పరిష్కారానికి సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు.

2019 ఏప్రిల్​ 9 : 67 ఎకరాల భూమిని యజమానులకు అప్పగించాలన్న కేంద్రం పిటిషన్​ను వ్యతిరేకించిన నిర్మోహి అఖాడా.

2019 మే 9 : సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పణ.

2019 మే 10 : మధ్యవర్తిత్వ కమిటీ తన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించిన సుప్రీం.

2019 ఆగస్టు 1 : పూర్తి నివేదికను సుప్రీంలో సీల్డ్​ కవర్​లో సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ.

2019 ఆగస్టు 2 : అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైనందున… ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీం నిర్ణయం.

2019 ఆగస్టు 6 : అయోధ్య వ్యాజ్యాలపై సుప్రీంలో రోజువారీ విచారణ ప్రారంభం.

2019 అక్టోబర్​ 16 : ముగిసిన వాదనలు… తీర్పు వాయిదా.

2019 నవంబర్​ 9: అయోధ్య తీర్పు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat