రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ గారు హామీ ఇచ్చారు. సమాజంలో అతి ప్రమాదకరమైన కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ఎవరు గొడవలు సృష్టించాలని చూసినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఎక్కడ దాక్కున్నా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ గారు హెచ్చరించారు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నిజనిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్ట్లు పెట్టి ఒక మతాన్ని కించపరిచి శునకానందం పొందటం కరెక్ట్ కాదనేది ఇక్కడి సారాంశం.