ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో తెలుగు భాషను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అమరావతిలో బౌద్ధానికి ప్రాచుర్యం కల్పించేందుకు కొరియన్, జపాన్ దేశాలకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి ఏపీలో కంపెనీలు పెట్టండి అని బతిమాలుకున్నాడు. అంతే కాదు అమరావతిలో స్కూళ్లలో జపనీస్, కొరియన్ భాషల కోసం ప్రత్యేకం సబ్జెక్ట్ పెడతామంటూ ప్రకటించాడు కూడా. అయితే ఇప్పుడు బాబు యూటర్న్ తీసుకుని తెలుగు రాష్ట్రంలో తెలుగు చచ్చిపోతుందంటూ శోకాలు పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని నారా చంద్రబాబు నాయుడు వకాల్తా పుచ్చుకున్న విషయం మాలోకానికి తెలిసి ఉండదు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి కాస్త….అసలే నాలుక మడత పెట్టడంలో తండ్రికి మించి పోయాడంటూ లోకేష్‌ను ఉద్దేశించి వెటకారం ఆడారు. అలాగే మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. ముందు మీ దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం? అంటూ విజయసాయిరెడ్డి బాబు, లోకేష్‌లపై మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లకు నెట్‌జన్లు పెద్ద ఎత్తున రియాక్డ్ అవుతున్నారు. మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా..నారా తాత అంటూ నెట్‌జన్లు చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.