రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో చంద్రబాబు, సీఎం జగన్, పవన్ కల్యాణ్‌తో సహా ఎవరిని వదలని వర్మ..ఈసారి లోకేష్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఉదయం 9.36 నిమిషాలకు పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు పాత్రధారికి గొడుగుపడుతూ..చెమటలు తుడుస్తున్న లోకేష్ పాత్రధారి పిక్‌ను వర్మ షేర్ చేశాడు. ఇప్పటికే వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ కాంట్రవర్సీగా మారాయి. వర్మపై కేసు కూడా నమోదు అయింది. కాగా ఇప్పటికే నారావారి పుత్రరత్నం లోకేష్‌పై పప్పు అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుంటారు. వైసీపీ నేతలు కూడా లోకేష్‌ను పప్పు అంటూ విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వర్మ ఏకంగా లోకేష్‌పై పప్పులాంటి అబ్బాయి పాటను విడుదల చేస్తున్నాడు. ఈ పాటపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. మరి రేపు విడుదల చేసే పప్పులాంటి అబ్బాయి సాంగ్ మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.
PAPPU LAANTI ABBAYI song from KAMMA RAJYAMLO KADAPA REDDLU to release dayafter 10 th at 9.36 Am #KRKR pic.twitter.com/swX5mQ7HgM
— Ram Gopal Varma (@RGVzoomin) November 8, 2019