జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ అనంతరం ఎన్నో స్టేజ్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు మీతో సుదీర్ అంటూ ఓ రొమాంటిక్ యాంగిల్లో బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ఈ సొట్టబుగ్గల కామెడీ నటుడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. ప్రముఖ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ తో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నాడు. రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అత్యంత వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు మంచి మెసేజ్ ఉంటుందని చెప్తున్నారు. సుధీర్ మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావడానికి రజనీకాంత్ చిరంజీవి ఇద్దరు స్పూర్తి అని వారిద్దరిని ఈ సినిమాలో అనుకరించాలని చెప్తున్నారు. దర్శకుడికి మొదటి సినిమా అయినా మంచి స్క్రిప్టుతో మంచి రచనతో ముందుకు వచ్చారని చెప్తున్నారు ఎక్కడా రాజీపడకుండా ఎక్కువ బడ్జెట్ తో సినిమా నిర్మించారట. ఈ సినిమాకు ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాట రాయడం విశేషం ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట.