ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అందుకనే ఇప్పటి తరం హీరోయిన్లు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని భావిస్తున్నారు వీరిలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ సొంతం చేసుకున్న నిధి ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు.డ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ పరిచయమవుతున్నారు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించనున్న ఈ సినిమాలో నిధి హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో ఈమెకు పారితోషికం కోటి రూపాయలు అందుకుంటుందట. గతంలో అగ్ర కథానాయికలు కూడా మూడు సినిమాలు వరకు చేస్తే గాని కోటి రూపాయలు పారితోషికం వచ్చేది కాదు కానీ ఈ ఒక్క సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఔరా అంటున్నాయి.
