ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ కళ్యాణ్ రాయలసీమ వాసులు అంటే చులకనగా ఉందా.. నువ్వు గొడవలు పెట్టాలని చూస్తున్నావా. ఎకసకాలుగా ఉందా.. ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా.. అంటూ ప్రశ్నించారు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుని ఉద్దేశించి ట్విట్టర్ లో ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కత్తి మహేష్ తనను తాను సమర్ధించుకుంటూ సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ ని ఆలా అనడం సబబేనని.. పవన్ ఎంతో చీప్ గా మాట్లాడుతున్నారని అలాంటి వ్యక్తిని ఇలా తిట్టడం కరెక్టే అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అనే విషయం తను గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు.
